సనాతన వైధికధర్మం కలిగిన మన భారతదేశం ప్రపంచదేశాలకు ఆధ్యాత్మికతను నేర్పే
దేశం అనడంలో సందేహం లేదు. వేదాలు,ఉపనిషత్తులు, భగవద్గీత వంటి దివ్య
గ్రంధాలను కలిగిన మహత్తర ఆధ్యాత్మిక సంపద కేవలం భారత దేశానికే స్వంతం. ఇంత
మహత్తర ఆధ్యాత్మిక సంపద నేడు హైందవసమాజం కలిగియున్నప్పటికి "సర్వ
సృష్టికర్త అయిన దైవం ఎవరు?" అన్న ప్రశ్నలకు "ఫలానా లక్షణాలు,ఫలానా
సామర్ధ్యాలు కలవాడే ఆ సర్వేశ్వరుడైన దేవుడు" అని నిర్ధిష్టమైన సమాధానమిచ్చే
స్థితిలో నేటి అధికశాతం ప్రజలు లేకపోవడం అత్యంత శోచనీయం. దానికి కారణం
-"ఇదీ నా నమ్మకం,నా ఇష్టం" అంటూ దేవుని అస్థిత్వం పట్ల ఎవరికి వారే తమ
స్వంత విశ్వాసాలు,స్వంత అభిప్రాయాలు ఏర్పర్చుకోవడమే!ఇది కరెక్ట్ నిర్ణయమా?
వేద శాస్త్రాలను అధ్యయనం చేసి నిజమైన సృష్టికర్త గుర్తించాల్సిన అవసరం
లేదా?
నిజానికి వేద గ్రంధాల వెలుగులో సృష్టికర్త ఎవరు? ధర్మమంటే ఏమిటి? ఇత్యాది
విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది పుస్తకాన్ని చదవాల్సిందే!
హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడెవరు?
Post a Comment